106 Viewsమంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలం. మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ మండల కేంద్రంలో గాంధీనగర్ నుండి సంగమల్లయ్య పల్లె వెళ్లే దారిలోనీ మసీదు వద్ద సయ్యద్ మసూద్ అలీ షా వారసి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్మి జెండా పండుగ నిర్వహించడం అభినందనీయమన్నారు. నవంబర్ 01 తారీఖున శుక్రవారం రోజున మొదలై 02 తారీకు శనివారం రోజున ముగుస్తుంది అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరుకావాలని మత గురువైన […]
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమావేశం – తెలంగాణ ప్రభుత్వం
81 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రం లోని ఓ ఫంక్షన్ హల్ లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమీక్ష సమావేశానికి హాజరైన ఎంపి గడ్డం వంశి క్రిష్ణ. పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ. వివిధ కుల సంఘాలు..కాంగ్రెస్ పార్టీ నాయకులు. *వంశి కామెంట్స్* రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టడం సంతోషకరం. ప్రతి ఐదు పది సంవత్సరాలకు ఒకసారి జనాభా, కుల గణన చేపట్టాలి. ఆయా […]
రామకోటి సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి పూజలు
72 Viewsదీపావళి లక్ష్మీదేవి పూజలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రామకోటి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సంస్థ అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలో చీకటి తొలగిపోయి వెలుగులు విరజిమ్మాలని కోరారు. మన జీవితాల్లో కష్టాలు, బాధలు అనే చీకటులను పారద్రోలి, సంతోషం, ఆనందం అనే వెలుగులు ఈ దీపావళి వల్ల రావాలన్నారు.
కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
130 Viewsఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల MRO ఆఫీస్ వద్ద కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 18 మంది లబ్దిదారులకు 18,02,088/- రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
శివ,కేశవుల నామస్మరణతో మారుమోగిన పురవీధులు…
136 Viewsముస్తాబాద్, అక్టోబర్ 31 మండల కేంద్రంలో శివకేశవ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ ఎలుసాని దేవయ్య నేతృత్వంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో శివపార్వతులు, శ్రీ వెంకటేశ్వరస్వామి పద్మావతి అలవేలుమంగ సమేతంగా స్వామివారిలను గ్రామంలో పురవీధుల గుండా ఉత్సవమూర్తులను ఊరేగింపు కార్యక్రమంలో ఆలయ పురోహితులు హరీష్ పంతులు ఆధ్వర్యంలో ఓం నమశ్శివాయ శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణలతో పురవీధులన్నీ మారుమోగాయి మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మంగళ హారతులు సమర్పించి మొక్కలు […]
ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహాయం. డాక్టర్ సింతోజి..
145 Viewsముస్తాబాద్, అక్టోబర్ 31(24/7న్యూస్ ప్రతినిధి); ఆవునూర్ గ్రామానికి చెందిన మండెపెళ్లి ఎల్లవ్వ-రాములు దంపతుల కూతురు వివాహం ఉన్నందున నిరుపేదలు కావడంతో ముస్తాబాద్ డాక్టర్ చింతోజీ శంకర్ పేద ప్రజలకు అండగా నిలిచి ప్రాణాలు కాపాడే మరో దేవుడు.. ఆడబిడ్డ పెళ్లికి తనవంతుగా 5. వేలు రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ ఆర్థిక సహాయం పలువురు బీజేపీ నాయకులు చేతుల మీదుగా అందించారు.
పేదింటి పెళ్లికూతురు వివాహానికి చేయూత…
458 Viewsఅక్టోబరు 31 (24/7న్యూస్ ప్రతినిధి): ఆవునూరు గ్రామానికి చెందిన మండేపల్లి ఎల్లవ్వ- రాములు దంపతుల కుమార్తె వివాహానికి కొండాపూర్ గ్రామానికి చెందిన సామాజిక సేవకులు డిఆర్: చిగురు ఆదిన్ బాబా, వారి సోదరుడు బిజెపి ఓబీసి మోర్చా మండల అధ్యక్షులు చిగురు వెంకన్న సహృదయం చాటిన 50.కేజీల బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సొల్ల క్రాంతి, గూడెం మాజీ సర్పంచ్ చిట్టినేని శ్రీనివాస్ రావు, జింకసాయి, ఆవునూర్ గ్రామస్థులు ఉన్నారు.
ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ జిల్లాఎస్పీ…
134 Viewsముస్తాబాద్, అక్టోబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మాజన్ ఆకస్మిక తనిఖి నిర్వహించారు. పోలీస్ స్టేషన్ లో గల రికార్డులను పరిశీలించి రాత్రి సమయంలో పెట్రోలింగ్ అన్ని గ్రామాలలో విస్తృతంగా చేపట్టాలని సూచించారు. దొంగతనాలు అరికట్టి ప్రతి గ్రామాలలో సీసీ కెమెరాలు పెట్టుకునేలా ప్రజలను మోటివేట్ చేయాలని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ సిహెచ్. గణేష్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










