ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమం, అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

14 Views

తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమం, అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా, మార్చి 10, 2026:
తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమ, అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా షెడ్యూల్డ్ కలముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పౌర సంబంధాల అధికారి కృష్ణమూర్తి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, లక్షెట్టిపేట మున్సిపల్ చైర్ పర్సన్ అంజలి, వైస్ చైర్ పర్సన్ రాజేశ్వరి లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్, పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటు ఇందిరా శక్తి క్యాంటీన్లు, పెరటి కోళ్ల పెంపకం, ఇతర అనేక వ్యాపారాలలో ప్రోత్సహిస్తూ మహిళలను ముందంజలో ఉంచే విధంగా కృషి చేస్తుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాయితీ గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. కుటుంబానికి పెద్దగా మహిళను గుర్తిస్తూ కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులలో స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వామ్యులను చేస్తూ చర్యలు తీసుకోవడం జరిగిందని, తద్వారా జిల్లాలో 3 శాతం విద్యార్థుల సంఖ్య పెరిగిందని, రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా  ముందంజలో ఉందని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మహిళా సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పిల్లలు పుట్టినప్పటి నుండి పెరిగే వరకు కుటుంబంలో మహిళల పాత్ర కీలకమైనదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో సకల సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించి విద్యాబోధన అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఐ కె పి, మెప్మా ద్వారా అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని, ఆరోగ్య మహిళ పథకం ద్వారా మహిళలలో నెలకొన్న దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ దిశగా పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించడం జరుగుతుందని, తాత్కాలిక ఉపశమనం కాకుండా పూర్తి స్థాయిలో వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 15 సంవత్సరాల వయసు కలిగిన బాలికలకు ప్రభుత్వం హెచ్ పి వి వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తుందని, భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మహిళ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *