ముస్తాబాద్, అక్టోబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మాజన్ ఆకస్మిక తనిఖి నిర్వహించారు. పోలీస్ స్టేషన్ లో గల రికార్డులను పరిశీలించి రాత్రి సమయంలో పెట్రోలింగ్ అన్ని గ్రామాలలో విస్తృతంగా చేపట్టాలని సూచించారు. దొంగతనాలు అరికట్టి ప్రతి గ్రామాలలో సీసీ కెమెరాలు పెట్టుకునేలా ప్రజలను మోటివేట్ చేయాలని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ సిహెచ్. గణేష్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




