ప్రాంతీయం

మంచిర్యాలలో సావిత్రిబాయి పూలే కి ఘన నివాళులు – బీఎస్పీ పార్టీ

28 Views

మంచిర్యాలలో సావిత్రిబాయి పూలే కి ఘన నివాళులు

​మంచిర్యాల: భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే  వర్ధంతి సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ పరిధిలో బహుజన్ సమాజ్ పార్టీ  ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 4వ డివిజన్ బి.ఎస్.పి కంటెస్టెంట్ శెట్టి ప్రవళిక  నేతృత్వంలో కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీఎస్పీ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జిలు  నాగుల కిరణ్ బాబు,  దాగం శ్రీనివాస్, మరియు బామ్ సేఫ్ నాయకులు శెట్టి శంకరయ్య, పెరిక మహేందర్, సుందిళ్ల నరేష్  పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.            ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ:
​విద్యే ఆయుధం: అణగారిన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు విద్యను ప్రసాదించడంలో సావిత్రిబాయి పూలే చేసిన కృషి అనన్యసామాన్యమని కొనియాడారు.
ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని బహుజనులు విద్యావంతులుగా, రాజకీయంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.

​తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సావిత్రిబాయి పూలే విగ్రహాలను ప్రతిష్టింపజేయాలని ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *