ప్రాంతీయం

శివ,కేశవుల నామస్మరణతో మారుమోగిన పురవీధులు…

50 Views

ముస్తాబాద్, అక్టోబర్ 31 మండల కేంద్రంలో శివకేశవ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ ఎలుసాని దేవయ్య నేతృత్వంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో శివపార్వతులు, శ్రీ వెంకటేశ్వరస్వామి పద్మావతి అలవేలుమంగ సమేతంగా స్వామివారిలను గ్రామంలో పురవీధుల గుండా ఉత్సవమూర్తులను ఊరేగింపు కార్యక్రమంలో ఆలయ పురోహితులు హరీష్ పంతులు ఆధ్వర్యంలో ఓం నమశ్శివాయ శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణలతో పురవీధులన్నీ  మారుమోగాయి మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మంగళ హారతులు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ చైర్మన్ కొల్లూరి నర్సయ్య, మండల సీనియర్ నాయకులు సంతోష రావు, రమేష్ రెడ్డి, నందెల్లి గోపాల్ రావు, చెవుల మల్లేష్ యాదవ్, అగుల్ల రాజేశం, వెంకట్రాజిరెడ్డి, ఎద్దండి నరసింహారెడ్డి, కంచం నర్సింలు, జాల బిక్షపతి, దెబ్బటఎల్లం, తాళ్ల రాజు, ఆరుట్ల మల్లారెడ్డి, సీనివాస్, బాలయ్య సార్, గ్రామ పెద్దలు భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్