మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలం.
మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ మండల కేంద్రంలో గాంధీనగర్ నుండి సంగమల్లయ్య పల్లె వెళ్లే దారిలోనీ మసీదు వద్ద సయ్యద్ మసూద్ అలీ షా వారసి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్మి జెండా పండుగ నిర్వహించడం అభినందనీయమన్నారు.
నవంబర్ 01 తారీఖున శుక్రవారం రోజున మొదలై 02 తారీకు శనివారం రోజున ముగుస్తుంది అని కొనియాడారు.
ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరుకావాలని మత గురువైన సయ్యద్ మసూద్ అలీ షా వారాసి కుల, మతాలకు అతీతంగా ఇట్టి కార్యక్రమం జరుగుతుందని మరియు అందరూ ఆహ్వానితులే అని ఆహ్వానించారు.
ఇట్టి కార్యక్రమంలో హజరత్ అక్బర్ అలీషా వార్షి దేవ షరీఫ్ యూపీ మత పెద్ద గురువు లడ్డన్ వాసి, కాన్పూర్ షాబీర్షా వాసి, జబల్పూర్ అమీషా వాసి, దేవ షరీఫ్ మల్లుషా వార్షి మీర్జాపూర్ చాంద్ వాసి, దేవ షరీఫ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మత గురువులు అన్నదాన ప్రదేశమును రిబ్బన్ కటింగు చేశారు.
అన్నదాన ప్రదేశమును రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత కుల, మతాలకు అతీతంగా వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు.





