కోనరావుపేట రిపోర్టర్ ఢీ కరుణాకర్/ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట, గ్రామంలోజరుగుతున్న మహాలక్ష్మి అమ్మవారి జాతరకు డాక్టర్ గోలి మోహన్, హాజరైనారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు పటేల్ సంఘం, గ్రామ ప్రజలు డాక్టర్ గోలి మోహన్, ను సాధనంగా ఆహ్వానించారు. అయన మాట్లాడుతూ మల్కపేట, గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను అమ్మవారు చల్లగా చూడాలని అదేవిధంగా ఈ గ్రామంలోని యువత ఊర్లో కాదు ఉద్యోగంలో ఉండాలని ఆర్థికంగా ఎదగాలని ఉన్నతమైన చదువులకు అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా లాంటి దేశాలు వెళ్లి ఈ గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు. గ్రామంలోని పేద విద్యార్థులకు పేద ప్రజలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇచ్చారు.గ్రామ మున్నూరు కపూ పటేల్ సంఘం గ్రామ యువకులు మాట్లాడుతూ ఎంతో మంది యువతకు ఆదర్శమవుతున్న డాక్టర్ గోలి మోహన్, ను పిలువగానే మా ఊరికి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మా గ్రామంలో చాలా మంది యువకులు చదువుకొని ఉన్నారని వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. గ్రామ సర్పంచ్ వార్డ్ మెంబర్ యువకులు గ్రామ ప్రజలు డాక్టర్ గోలి మోహన్, ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆరె లత మహేందర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
