దుబ్బాక నవంబర్ 5:సోమవారం రోజున దుబ్బాక లో ధర్మ సమాజ్ పార్టీ రోడ్ షో అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్.
– దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వెంకట ప్రసన్న.
ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనార్టీలు, ప్రజాస్వామిక ప్రేమికులు అందరూ పాల్గొని నామినేషన్ కార్యక్రమం & రోడ్ షోను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అన్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారధన్ మహరాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు అని తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్ ను ఉద్దేశించి దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వెంకట ప్రసన్న మాట్లాడుతూ తెలంగాణ లో ఉన్నటువంటి సబ్బండ కులాలకు అధికారం రాకుండా అడ్డుపడుతున్న పార్టీలకు బుద్ధి చెప్పడం కోసం దుబ్బాక గడ్డ మీద మొట్టమొదటి సారిగా ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తు తో బయలుదేరిన పార్టీ, ధర్మ సమాజ్ పార్టీ పేద ప్రజల్ని మభ్యపెట్టి మందు, డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసి ప్రజలను ఇబ్బందులు పెడుతున్న పార్టీల భరతం పట్టడానికి ధర్మ సమాజ్ పార్టీ దుబ్బాక గడ్డమీద నిలబడుతుందని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యాదగిరి, లక్ష్మణ్ చందు, అనిల్, కనకరాజు, నందు,స్వామి, ప్రశాంత్, రాజు,లింగం, కర్ణకర్ రమేష్, మరియు తదితరులు పాల్గొన్నారు