మండల టాపర్ లను అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ……
మండల విద్యాధికారి గాలిపెల్లి కృష్ణహరి. …..
ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాలలో మండల ర్యాంకులు సాధించిన పెరుమాండ సుస్వరా -580,నీరటి నందిక -562,ఏనాగుర్తి నవనీత్ -559, బద్ది పడిగే అభినవరెడ్డి -556, జొన్నల స్నేహిత్ చరణ్ -552,దిమ్మటి సంజన -550,చల్ల సాత్వికరెడ్డి -550 లను రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అభినందించారు. మారుమూల ప్రాంతములో కార్పొరేట్ సంస్థ లకు ధీటుగా 32 మంది విద్యార్థులకు 500 పైగా మార్కులు సాధించడంతో కరెస్పాండంట్ మిట్టపల్లి లక్ష్మి నారాయణను ఎస్పీ అభినందించారు అనంతరం మండలవనరుల కేంద్రములో మండల విద్యాధికారి గాలిపెల్లి కృష్ణహరి విద్యార్థులను అభినందించింది గమ్యాన్ని ఏర్పారుచుకొని ముందుకు సాగాలని సూచించారు.
