భక్త ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం…
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేటలోని చిన్న బడి సమీపంలో బడి దగ్గర ఉన్న భక్త ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా జరిపారు . ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వర్స కృష్ణ హరి, నాయకులు నర్సింలు, గుండాడి వెంకట్ రెడ్డి, బొమ్మ కంటి వెంకన్న , మార్కండేయ, గన్నమనేని సుధాకర్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం కార్యక్రమం నిర్వహించారు.
