పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య…
(కోనరావుపేట ఏప్రిల్ 16): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన బీరప్ప కామరాతిల ఆలయ ప్రతిష్టాపనలో భాగంగా గతవారం రోజులుగా ఉత్సవాలను కురుమ సంఘం నాయకులు అత్యంత వైభవంగా నిర్వహించారు.ఇట్టి ఉత్సవాలలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య బుధవారం ఆలయాన్ని దర్శించుకుని పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి,మాజీ సర్పంచ్లు గోపు పర్శ రాములు, కేంద గంగాధర్,కదిరే శ్రీనివాస్,మాజీ ఉప సర్పంచ్ దొంతరవేని శ్రీనివాస్ నాయకులు శివతేజరావు, కడారి శ్రీనివాస్ భూపతి రెడ్డి కురుమ సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
