సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామంలో శుక్రవారం దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ధార్మిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి పాల్గొని దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దైవభక్తి కలిగి ఉండాలని దత్తాత్రేయ స్వామి సూక్తులు అనుసరణీయం అని,దత్తాత్రేయ దేవాలయం అత్యంత అద్భుతంగా నిర్మించిన నిర్వాహకులను అభినందించారు, దత్తాత్రేయ దేవాలయం భక్త బృందం ఆధ్వర్యంలో వంగపల్లి ఆంజనేయ స్వామికి శాలువాతో ఘన సన్మానం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మోహన కృష్ణ, అర్చకులు అల్లం సాయిలు, గౌరిషెట్టి ఆంజనేయులు,గరిపల్లి గౌరి శంకర్, మౌన స్వామి,భక్తులు తదితరులు పాల్గొన్నారు