- హాజరై ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
కోనరావుపేట ఏప్రిల్ 16 (tslocal vibe): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. కురుమ సంఘం నాయకులు ఇట్టి ఆలయంలో గత వారం రోజులుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం బీరప్ప కామరాతిలను దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు.ఆ దేవుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు.ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా, మాజీ జెడ్పిటిసి నాగం కుమార్, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, డైరెక్టర్లు అజీమ్ పాషా, బాశెట్టి నాగరాజు,వాల్య నాయక్,యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు నాగండ్ల భూమేష్,గ్రామ శాఖ అధ్యక్షుడు పెంతల శ్రీనివాస్, నాయకులు చేపూరి గంగాధర్, బందెల సదానందం,దర్ర రవి,పల్లె రవీందర్,చిగుర్ల తిరుపతి,మ్యాకల బాబు, నాగాండ్ల ఎల్లయ్య, ఇద్దగిరి నరేష్ కురుమ సంఘం యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
