రాజకీయం

పార్ల‌మెంట్ స‌మావేశాల్లో బీసీ మ‌హిళా బిల్లును ఆమో దించాలి

216 Views

మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట పెట్టాలి

 

జాతీయ బీసీ సంక్షేమ సంగం ములుగు జిల్లా అధ్యక్షుడు బట్ట మురళీ కృష్ణ

 

ములుగు జిల్లా,సెప్టెంబర్ 21

 

చ‌ట్ట‌ స‌భ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే మ‌హిళా బిల్లు చారిత్రక అవసరమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు తెలిపారు.పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుకు అన్ని పార్టీలు ఆమోదం తెలపా లని డిమాండ్ చేశారు. పార్ల మెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టాలని కోరారు.మహిళా బిల్లు, బీసీల కు ప్రత్యేక వాటా కల్పించేందు కు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలన్నారు. మహిళలకు విస్తృత అవకా శాలు లేకపోతే దేశ ప్రగతి కూడా సాధ్యం కాదనేవిషయం గుర్తుంచుకోవాలన్నారు.ప్రత్యేక సమావేశాల్లో సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజకీయా లకు అతీతంగా ఏకమై అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని మురళి కృష్ణ కోరారు.బీజేపీ సార‌ధ్యంలోని ఎన్డీఏ కూటమి తో పాటు ఇండియా కూటమి, ఇతర పార్టీలు కూడా మహిళా బిల్లుకు ఆమోదం తెలపడానికి కదలిరావాలనిన్నారు.అన్ని రంగాల్లో మహిళలకు అన్యా యమే జరుగుతోందని మురళీ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా బిల్లుకు ఆమోదం లభిస్తే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు లభించడం ద్వారా వారి అభివృద్ధికి మరింత తోడ్పాటు ఇచ్చే అవకాశం కలుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మంచర్ల నాగేశ్వరరావు,జిల్లా యూత్ అధ్యక్షులు తోటకూరి శ్రీకాంత్, ఏటూరునాగారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బట్టు గోపి,సీనియర్ నాయకులు బెజ్జంకి రఘు చారి,పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *