కోనరావుపేట ఏప్రిల్ 18(tslocal vibe):రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఉన్నటువంటి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ అభివృద్ధికై గోవిందారం గ్రామానికి చెందిన మాధవి శర్మ కుమార్తెలు పూర్ణిమ,లక్ష్మి,సుష్మా ,శ్వేత లు వారి నాన్న కీర్తిశేషులు వెల్మ కన్న లక్ష్మణ శర్మ జ్ఞాపకార్థం విరాళంగా 22116 రూపాయలు,25 గ్రాముల వెండిని గ్రామ మాజీ సర్పంచ్ మంతెన సంతోష్ కు శుక్రవారం అందజేశారు.ఆలయ అభివృద్ధికి సహకరించిన వారి కుటుంబ సభ్యులకు మంతెన సంతోష్ ధన్యవాదాలు తెలిపారు.ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి గ్రామంలోని ఆలయ అభివృద్ధికి పాటుపడాలని ఆయన కోరారు.ఈకార్యక్రమంలో మంతెన మల్లారెడ్డి,కోనరావుపేట మాజీ ఎంపీటీసీ దేవరకొండ నరసింహా చారి, కదిరే సతీష్ తదితరులు పాల్గొన్నారు.
