- కోనరావుపేట/రిపోర్టర్ డి. కరుణాకర్ /రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా తొమ్మిదవ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన రొక్కం దేవారెడ్డి,ని మంగళ్లపల్లి, గ్రామస్తులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఊరుకు సమాజానికి ఎంతో సేవ చేస్తూ ప్రజల మన్నాలను పొందిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేవా రెడ్డికి గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెలిశాల సంతోష్, ఉప సర్పంచ్ శరత్, శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
