*మరో 100 ఎకరాల భూమి అమ్మకానికి నోటిఫికేషన్*
హైదరాబాద్:ఆగస్టు 04
రికార్డు స్థాయి రేటుకు కోకాపేట్ భూములను అమ్మిన హెచ్ఎండీఏ ఇప్పుడు మరిన్ని భూములు అమ్మేందుకు సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా బుద్వేల్‌లోని 100 ఎకరాలను అమ్మేందుకు సిద్ధమైంది.
ఇందుకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 100 ఎకరాలను 14 పార్సిల్‌గా అమ్మాలని నిర్ణయించింది. ఈనెల 10న రెండు సెషన్లలో ఈ వేలం నిర్వహించాలని నిర్ణయించింది. ఒక్కో ఎకరానికి గరిష్టంగా రూపాయలు రూ.20 కోట్ల విలువను ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఆరు రోజుల్లో వేలం పూర్తి చేయాలని సర్కారు ఆదేశం ఇందుకు సంబంధించి 6న ప్రీమిటీ సమావేశం 8న రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ కా నిర్ణయించారు….
