సంక్రాంతి సంబురం
మెదక్ జిల్లాలో ఘనంగా వేడుకలు
ముగ్గులతో విరబూసిన వాకిళ్లు
ఇంటింటా పిండి వంటల ఘుమఘుమలు
పతంగులు ఎగరేసిన చిన్న, పెద్దలు
జనవరి 16
మెదక్ జిల్లా
సంక్రాంతి పండుగను మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వాకిళ్లన్నీ రంగురంగుల ముత్యాల ముగ్గులు, ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు. హరిదాసులు, గంగిరెద్దుల ఇంటింటికీ తిరుగుతూ సందడి చేశారు.
సంక్రాంతి, కనుమ పండగలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట పట్టణా లతో పాటు అన్ని పల్లెల్లో మహిళలు, యువతీ యువకులు, చిన్నారులు సందడి చేశారు. రంగ వల్లులు.. గొబ్బెమ్మలు, బసవన్నల విన్యాసాలు. గాలిపటాలు.. బొమ్మల కొలువులు.. పిండి వంటలతో సంక్రాంతి పండుగను ప్రజలు ఆనం దోత్సాహాలతో జరుపుకున్నారు
