వర్గల్ మండల్ జనవరి 13 :కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకునేల ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం నేడు వర్గల్ మండలం గౌరారం గ్రామంలోని శివాజీ విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా నమోదు చేసుకోవాలో వివరిస్తూ వాటి లాభాలను తెలియజేశారు.
ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు ముద్ర లోన్లు, అవస్ యోజన, పీఎం కిసాన్ సమాన్ నిధి, ఆరోగ్య సేవలు, గ్యాస్ ఉజ్వల్ యోజన, మరియు ఆర్థిక సెవలపై సంబంధిత విభాగాల అధికారులు పాల్గోని అవగాహనా కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏపీజీవీబీ మేనేజర్ యం .నర్సింలు, గ్రామ సర్పంచ్ బి .వినోద నర్సింహారెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మఠం మహిపాల్ యాదవ్,మహిళా సంఘము సీసీ కె . పద్మలత, అధికారులు గ్రామ సెక్రెటరీ శ్రీనివాస్,వార్డ్ మెంబర్లు, ప్రజా ప్రతినిధులు,మహిళ సంఘాలు,గ్రామ పెద్దలు,హెల్త్ డిపార్ట్మెంట్, బీజేవైఎం ఉపాధ్యక్షులు ఎల్కంటి మధుసూదన్ రెడ్డి, బీజేపీ బూత్ అధ్యక్షులు పూదరి ప్రశాంత్ గౌడ్, బీజేపీ కార్యకర్తలు మరియు యువ నాయకులు పాల్గొనడం జరిగింది.