- చందుర్తి – జ్యోతి న్యూస్
- చందుర్తి మండలం లోని జోగాపూర్ గ్రామానికి చెందిన ఎంపిటిసి గణేష్ మాట్లాడుతూ…
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు ఎంపీటీసీ లను పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం లో నిర్వహించే అభివృద్ధి పనుల్లో ఎంపీటీసీ లను భాగస్వాములు చేసి వారి ఆధీనంలో పనులు జరిగేలా చూడాలని జోగాపూర్ ఎంపీటీసీ సభ్యులు మ్యాకల గణేష్ ఆదివారం అన్నారు. ఎంపీటీసీలు గా గెలిసి కేవలం ఉత్సవ విగ్రహాలుగా ఉండాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో నెలకొందని ఇప్పటికైనా ప్రభుత్వం అభివృద్ధిలో ఎంపీటీసీ లను భాగస్వాములు చేయాలని వారు డిమాండ్ చేశారు.
