తిరుపతి జిల్లా గూడూరు.. నిన్న ఆదివారం రాత్రి అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు స్టేడియం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారిచే నూతన జిమ్ ప్రారంభించబడినది. అనంతరం స్టేడియం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారిని మరియు జిమ్ దాత అయిన తాళ్లూరు సాయి ప్రసాద్ నాయుడు గారిని ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ స్టేడియంలో ఉన్నటువంటి సమస్యలను స్టేడియం అభివృద్ధి కమిటీ వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. స్టేడియం లో ఉన్న సమస్యలు అన్నిటిని ఒక్కొకటిగా పరిష్కరిస్తానని గూడూరులో పుట్టి పెరిగిన వ్యక్తిగా మీ వాడిగా స్టేడియంలో క్రీడలు ఆడిన వ్యక్తిగా ఈ స్టేడియంని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నామీద ఉందని, తప్పకుండా ప్రతి సమస్యను పరిష్కరిస్తానని నేను అడిగిన వెంటనే జిమ్ము డొనేట్ చేసిన ప్రసాద్ నాయుడు గారిని అభినందిస్తున్నానని అదేవిధంగా తొందరలో నూతన గ్యాలరీ ఏర్పాటు చేస్తానని అంతేకాకుండా స్టేడియంకి అవసరమైన తాగునీరు కూడా అందిస్తానని స్టేడియంలో ఎప్పుడు అవసరమైన లైట్లు అన్ని వేయిస్తానని మరియు ప్రతి సమస్యను కూడా ప్రజల అభీష్టం మేరకు నెరవేరుస్తానని చెప్పారు. నా దృష్టికి స్టేడియం సమస్యలు తీసుకువచ్చిన అభివృద్ధి కమిటీ కన్వీనర్ రాజేంద్రప్రసాద్ గారిని మరియు వారి సభ్యులందరినీ మనస్పూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్రప్రసాద్, కోటేశ్వరరావు, రజిని కాంత్, విజయకుమార్, మస్తాన్, సుమన్ రెడ్డి, సురేంద్ర రెడ్డి, నాగేశ్వరరావు, మస్తాన్, శంకరయ్య, రాధయ్య, శర్మ అన్ని రంగాల క్రీడాకారులు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.
