రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో దొంగలు చోరీకి పాల్పడి బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన షేక్ ఖలిదా ఇంట్లో చొరబడిన దొంగలు ఆరు తులాల బంగారం 20 తులాల వెండి పట్టగొలుసులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. సంపంగి శంకరవ్వ, మల్లయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి 30 తులాల వెండి తులం బంగారం ఎత్తుకెళ్లారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
