చేబర్తి లో ఘనంగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు
అక్టోబర్ 23
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో భజరంగ్ దళ్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు సోమవారం యువజన నాయకులు ఇంద్రా గౌడ్ మరియు సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని చేబర్తి లో మొదటిసారిగా దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి శరన్నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్న భజరంగ్ దళ్ యూత్ సభ్యులను అభినందించి ప్రతి ఒక్కరూ దైవ భక్తి కలిగి ఉండాలని.
యువత మంచి మార్గంలో పయనించి తల్లితండ్రులకు గ్రామానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు అలాగే బజరంగ్ దళ్ యూత్ నాయకులు మాట్లాడుతూ దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి దుర్గామాత ఆశీర్వాదములు అందరూ బాగుండాలని నవరాత్రి వేడుకలలో ప్రతిరోజు అమ్మవారిని వేడుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పురోహితులు రాధాపతి శర్మ, బజరంగ్ దళ్ యూత్ నాయకులు గ్యార నవీన్,రమేష్,శేఖర్, భానుప్రసాద్,సురేష్,కార్తీక్, ఉన్నారు
