కోనరావుపేట/ రిపోర్టర్ డి.కరుణాకర్/
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం లోని నిమ్మపల్లి, జై సేవాలాల్ ఊరు తండా గ్రామంలో ప్రమాదవశత్తు షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పంటుకుని నిరుపేద కుటుంబాలయిన మల్యాల లింబయ్య, సురేష్, లకు చెందిన నివాసముంటున్న పూరి గుడిసెలు పూర్తిగా కాలిపోయి బూడిద అయ్యాయి. ఇంట్లో నిత్యవసర వస్తువులు సామాగ్రి మొత్తం కాలిపోవడంతో తలదాచుకోవడానికి ఏమీ లేకుండా గూడులేని వారయ్యారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ రాముల్ నాయక్,లంబాడీల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్, ప్రజలు కోరుతున్నారు.
