సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఐఓసీ బిల్డింగ్ పక్కన ఖాళీ ప్రదేశంలో సీఎం జన్మదిన రోజున ప్రారంభించిన సీఎం క్రికెట్ కప్ పోటీలు ఆదివారం నాడు మూడవరోజు హోరా హోరీగా కొనసాగాయి క్యాసారం వర్సెస్ గజ్వేల్ వేణు ఎలెవన్ టీమ్స్ ఆడగా వేణు ఎలెవన్ టీమ్ ఘన విజయం సాధించింది ఈ సందర్భంగా గజ్వేల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ క్రీడకు మానసిక ఉల్లాసం తో పాటు శరీర దృఢత్వం కలుగుతుందని సీఎం కెసిఆర్ జన్మదినం సందర్భంగా సీఎం క్రికెట్ కప్ టోర్నీ ప్రారంభించడం జరిగింది అని దాదాపు 32 టీమ్స్ రావడం జరిగింది అని సీఎం క్రికెట్ కప్ టోర్నమెంట్ కు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు




