24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 5)
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని పస్తాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బైకును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇంటర్ విద్యార్థి శ్రీకాంత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు సంగారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
