కోనరావుపేట/ రిపోర్టర్ డి.కరుణాకర్/ రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలోని జై సేవాలాల్ ఊరు తండా గ్రామం లో మల్యాల లింబయ్య, నివసిస్తున్న పూరి గుడిసె షార్ట్ సర్క్యూట్ వలన పూర్తిగా కాలిపోయింది. నిరుపేద కుటుంబమైన లింబయ్య కుటుంబ సభ్యులను లంబాడీల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్ పరామర్శించి మూడు వేల రూపాయల నిత్యవసర సరుకులు అందించారు. నరేష్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్న కొనరావుపేట మండలంలో దళిత, గిరిజన బహుజన, ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందలేవు అని అన్నారు. ప్రభుత్వం స్పందించి లింబయ్య కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించి వారి కుటుంబానికి ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో లైవ్ నాయకులు శ్రీనివాస్ నాయక్, మోహన్ నాయక్, రాజు నాయక్, రమేష్, ప్రకాష్, తిరుపతి తదితరులు పాల్గొనడం జరిగింది.
