హుస్నాబాద్ అక్టోబర్ 24
24/7 తెలుగు న్యూస్
హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామానికి చెందిన బత్తిని కనకయ్య అనే గీతా కార్మికుడు మంగళవారం ఉదయం వృత్తి రిత్య తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో జారీ కిందపడడం జరిగింది.
ఈ ప్రమాదంలో కనకయ్యకు కాలు విరగడం జరిగింది. స్థానికులు హుటా హుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తిని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని స్థానికులు కోరారు.





