ఉండడానికి గూడు లేని నిరుపేదల సమస్యల పరిష్కారానికి ప్రజా-కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాల్లో దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారి సమస్యలను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. కనీసం నివసించడానికి ఇండ్లులేని నిరుపేద కుటుంబాలు ఎన్నో సంవత్సరాలనుండి పురిగుడిసెలలో నివసిస్తుండడం బాధాకరమని ప్రజా కార్మిక సంఘాలు ఆరోపించాయి. పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారి కుటుంబాలను ప్రజా కార్మిక సంఘాల నాయకులు ఆయా గ్రామాల్లోని క్షేత్రస్థాయిలో సందర్శించి వారి ఇబ్బందుల గురించి తెలుసుకోని ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ నేల 21 వ తేదీన వీర్నపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు రెండు పడకల గదుల ఇండ్లు కోసం జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజా కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
