Breaking News

నల్లగొండ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ….

145 Views

ఆదివారం తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా సంఘాన్ని బలోపేతం చేయుటకు ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఆయన కన్న కలలు నిజం చేయుటకు ప్రతి ఒక్కరం కంకణ బద్ధులై ముందుకు సాగాలని పిలుపునివ్వడం జరిగింది.

ఈ సందర్భంగా గ్రామ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. గ్రామ శాఖ అధ్యక్షులుగా కవ్వంపెల్లి సంపత్, ప్రధాన కార్యదర్శిగా కవ్వంపల్లి మహేష్ ,గౌరవ అధ్యక్షులుగా కవ్వంపెల్లి తిరుపతి, సలహాదారుడుగా కవ్వంపెల్లి రాజయ్య, ఉపాధ్యక్షులుగా శనిగరం శ్రీనివాస్, ఎడెల్లి సంపత్, కార్యదర్శిగా కవ్వంపల్లి నరేష్ , ప్రచారకార్యదర్శిగా అందే నరేష్, కార్యవర్గ సభ్యులుగా మారేపల్లి శివ ,కౌంపల్లి నరేష్ ,రవి, శ్రీ సాయి చందు, అంజి తదితరుల ను ఎన్నుకోన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు వంతడుపుల సంపత్,నల్లగొండ ఎంపీటీసీ కపంపల్లి పద్మ, ఉప సర్పంచ్ కవ్వంపల్లి తిరుపతి,మండల మహిళా అధ్యక్షురాలు కుంభాల లత, మండల ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, గౌరవ అధ్యక్ష, సలహాదారులు బొర్ర రవీందర్ ,దుర్గం రాజమల్లయ్య, మండల ఉపాధ్యక్షులు తూర్పాటి అజయ్, తాళ్లపల్లి నందకిషోర్,ప్రచార కార్యదర్శి అల్వాల సంపత్, కార్యవర్గ సభ్యులు ఎలుక పెళ్లి లక్ష్మణ్, అసంపెల్లి అశోక్ తదితరులతోపాటు గ్రామానికి చెందిన పలువురు అంబేద్కర్ సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *