- కోనరావుపేట/ రిపోర్టర్ ఢీ.కరుణాకర్/ బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం లోని బాకూరు పల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కు వస్తున్న సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోనరావుపేట బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు కుమ్మరి దేవదాస్ అన్నారు మండలం లోని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే వివిధ ప్రజాసంఘాల నాయకులు విద్యావంతులు మేధావులు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
