ఎఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు అజ్మీరా రాజు నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్పిటిసి…..
ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లి తండా గ్రామపంచాయతీకి చెందిన ఏఐబిఎస్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అజ్మీర రాజు నాయక్ కుటుంబ సభ్యులను శనివారం ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు,
ఏఐబిఎస్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అజ్మీర రాజు నాయక్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయనా
కొనరావుపేట మండలం కొండాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని హనుమాన్ తండాకు చెందిన లకవత్ తిరుపతి అనే వ్యక్తి నిమ్మ పెళ్లికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు చేపూరి ప్రసాదు ఇచ్చిన ఇంజక్షన్ వికటించి ఇటీవల మరణించాడు,
దీంతో ఎఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుని హోదాలో రాజు నాయక్ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన గిరిజన సంఘాల నాయకులతో కలిసి సిరిసిల్ల కొత్త చెరువు వద్ద సిరిసిల్ల వేములవాడ ప్రధాన రహదారిపై ధర్నా చేశాడని పోలీసులు ఎంత చెప్పినా వినకుండా సిరిసిల్లలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ పోలీసులపై దాడి చేసి కొట్టిన కేసులో అజ్మీరా రాజు నాయక్ లతో పాటు మరో ఏడుగురిని ఆరెస్ట్ చేసి గురువారం రిమాండ్ కు పంపారు,
ఈ విషయం లో తీవ్రంగా ఆందోళన చెందుతున్న అజ్మీరా రాజు నాయక్ బార్య అయిన బాకూరు పల్లి తండా గ్రామపంచాయతీ సర్పంచ్ అజ్మీరా మంజుల ను శనివారం జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా మానిటరింగ్ సభ్యులు అజ్మీరా తిరుపతి నాయక్, ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ వరుస కృష్ణా హరి, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారెడ్డి కృష్ణారెడ్డి , ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య సీత్యా నాయక్ , దేవుని గుట్ట తండా గ్రామ శాఖ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ లు వెళ్లి ఆమే ను పరామర్శించారు ,
ఏలాంటి ఆందోళన చెందవద్దని అధైర్య పడవద్దని ఆమే కు వారు భరోసా కల్పించారు,
