కొడంగల్ నియోజకవర్గం:అక్టోబర్ 3
24/7 తెలుగు న్యూస్
కొడంగల్ నియోజకవర్గం లోని కోస్గి మున్సిపల్ కేంద్ర పరిధిలో నూతనంగా నిర్మించబడిన “హాస్పిటల్” ప్రారంభోత్సవానికి ఈ నెల 4న “ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వస్తున్న సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోస్గి సభ ప్రాంగణాన్ని(జూనియర్ కాలేజీ గ్రౌండ్) పరిశీలించడం జరిగింది
మున్సిపల్ మరియు సంబంధిత అధికారులతో కలిసి సభ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. కార్యక్రమానికి వచ్చే కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ సౌకర్యాలపై అధికారులతో చర్చించారు.
