రాజకీయం

కర్కపట్ల లో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

150 Views

కర్కపట్ల: అక్టోబర్ 5
24/7 తెలుగు న్యూస్

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కరకపట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని గురువారంనాడు స్థానిక సర్పంచ్ గాజే నర్సింలు అధ్యక్షతన ఎంపీపీ పాండు గౌడ్, గారు జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఎంపిటిసి ఫోరం మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్, వంటి మామిడి మార్కేట్ కమిటీ డైరెక్టర్ రాందాస్ గౌడ్, సుగునాకర్ రెడ్డితో కలిసి నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తూ, బంగారు తెలంగాణ లక్ష్యంగా రైతుల అభ్యున్నతి కోసం కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి,అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలు అండగా ఉండాలని రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో గెలిపించే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు ఈరోజు మర్కుక్ మండలంలో వివిధ నూతన భవనాలు ప్రారంభించడం జరిగిందని, అలాగే బతుకమ్మ చీరలు పంపిణీ, యువతకు క్రీడ సామాగ్రి అందజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఎండీ అప్సర్,కార్యదర్శి రేఖ,గ్రామ పంచాయితీ పాలక వర్గం,గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తి బాబు,ఆత్మ కమిటీ డైరెక్టర్ సంతోష్ రెడ్డి,లక్కాకుల నరేష్,పిట్ల సత్యనారాయణ, పాముల పర్తి కరుణాకర్, వివిధ గ్రామాల సర్పంచ్ లు,డైరెక్టర్లు,బి ఆర్ ఎస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *