కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం లో నాగారం,మల్కపేట, గ్రామాలలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి, తో కలిసి వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. నాగారం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు అలాగే గుట్టపై ఉన్న సీతారామస్వామి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించి మల్కపేటలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి రిజర్వాయర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా నాగారం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వేములవాడ గడ్డపైన కార్పొరేట్ శక్తులకు స్థానం లేదని సంవత్సరానికి 100 కోట్లు సంపాదించి కోటి రూపాయలుఖర్చు పెడితే ప్రజల నాయకుడు కాలేరని ప్రజలపై కొందరు వ్యక్తులకు నిజమైన ప్రేమే ఉంటే వారికున్న కార్పొరేట్ హాస్పిటల్ లను ధర్మాస్పత్రిలుగా మార్చాలని ఎంబిబిఎస్ సీట్లు బీసీలకు ఉచితంగా ఇవ్వాలని అన్నారు.తాను పదవిలో లేనప్పుడే జర్మనీ నుండి 200 కోట్లు తీసుకువచ్చి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించానని ప్రజల గుండెల్లో ఉండేవాడే నిజమైన నాయకుడని తనకు వేములవాడతో పేగు బంధం ఉందని అన్నారు.ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా మల్కపేట రిజర్వాయర్ కట్టపై కేకు కట్ చేసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలోగ్రామ సర్పంచ్ బాస లావణ్య శ్రీనివాస్, ఆరే లతమహేందర్, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, వైస్ ఎంపీపీ వంగపల్లి సుమలత శ్రీనివాస్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గోపు పరుశరాములు, తహసిల్దార్ నరేందర్, ఎంపీడీవో రామకృష్ణ, నాయకులు గోగు ప్రతాపరెడ్డి, గంగసాని రమణారెడ్డి, పూడూరి ప్రవీణ్, సిద్ధంశెట్టి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
