నవంబర్ 7
—-పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పువ్వాడ.
ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన పలువురు ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఖమ్మం టౌన్ టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇసాక్ ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారిలో ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ గాఫూర్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు హామిత్, నగర మైనార్టీ అధ్యక్షులు చోటు, సుఫియన్ రెడ్డి, సాయి సతీష్, కోటి, కలీం, ఘని నిజాం, నాగుల్ మీరా, షకీల్, షాహిద్ హమీద్, అర్షద్, అంజద్, వెంకట్, సురేష్, శ్రీను, సుధాకర్ మేహబూబ్, హరీష్ శంకర్ తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
రానున్న ఎన్నికల్లో తామంతా కష్టపడి పని చేసి బిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ని గెలిపించుకుంటామని పేర్కొన్నారు.





