రాజకీయం

నామినేషన్ దాఖలు చేసిన బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్

191 Views

మంచిర్యాల అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘునాథ్ వెరబెల్లి ఈరోజు మంచిర్యాల RO కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా మంచిర్యాల పట్టణ ప్రధాన విధుల్లో బీజేపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా కాషాయ జెండా కార్యకర్తలతో పట్టణం జనసంద్రంగా మారింది. అసెంబ్లీ నలుమూలల నుండి యువ నేత రఘునాథ్కి మద్దుతు గా కార్యకర్తలు భారీగా తరిలి వచ్చి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. బీజేపీ కార్యకర్తల బైక్ ర్యాలీ వైష్య భవన్ దగ్గర ప్రారంభం అయ్యి ఐబీ చౌరస్తా – ఓవర్ బ్రిడ్జి – శ్రీనివాస్ టాకీస్ – ముఖారమ్ చౌరస్తా – అర్చన టెక్స్ చౌరస్తా – మార్కెట్ రోడ్ – బస్ స్టాండ్ – బెల్లంపల్లి చౌరస్తా – వెంకటేశ్వర టాకీస్ వద్ద ముగిసింది. ర్యాలీలో ఐబీ చౌరస్తా వద్ద భారీ గజ మాలతో కార్యకర్తలు రఘునాథ్ని సత్కరించారు.

ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ మంచిర్యాల లో మార్పు వస్తేనే అభివృద్ది సాధ్యం అని అది కేవలం బీజేపీ ద్వారానే మంచిర్యాల అభివృద్ది చెందుతుంది అని అన్నారు.

గత 5 సంవత్సరాలలో బీజేపీ కార్యకర్తలు ప్రజా సమస్యల పై చేసిన పోరాటంలో అనేక కేసులు నమోదు చేసిన కార్యకర్తలు వెనకడుగు వేయకుండా ప్రజల కోసం పని చేశారని అది కేవలం బీజేపీ తోనే సాధ్యం అని అన్నారు.

గత 20 ఎండ్లు ఎమ్మెల్యే గా ఉన్న దివాకర్ రావు చేసిన అభివృద్ది శూన్యం అని మరియు కాంగ్రెస్ అభ్యర్ధి ప్రేమ్ సాగర్ రావు గెలిస్తే భూ కబ్జాలు మరియు బెదిరింపులు తప్పవు అని అన్నారు.

బీజేపీ పార్టీ మంచిర్యాల లో గెలిస్తే యువతకు 5 ఎండ్లలో 5 వేల ఉద్యోగాలు, JNTU ఇంజినీరింగ్ కళాశాల, సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు, రైతులకు కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేస్తాం, మంచిర్యాల పట్టణంలో వరదల శాశ్వత పరిష్కారాణికి రాళ్ల వాగు పై కరకట్ట నిర్మాణం, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను హై పవర్ కమిటీ వేతనాలు చెల్లింపు, మంచిర్యాల పట్టణంలో రాజీవ్ నగర్ రైల్వే ఫ్లై ఓవర్, హమాలి వాడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి, గూడెం లిఫ్ట్ పైప్ లైన్లు మార్పు, ఎల్లంపల్లి బాధితులకు పెండింగ్ బకాయిలు చెల్లింపు వంటి 9 హామీలు నెరవేరుస్తానని రఘునాథ్ హామీ ఇచ్చారు.

ఒక్కసారి అవకాశం ఇవ్వాలని నరేంద్ర మోడీ నాయకత్వంలో అసెంబ్లీ అభివృద్ది చేస్తామని తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *