తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రేపు జరగబోయే పోలింగ్కు సర్వం సిద్ధం చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్, కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి మరియు చెన్నూర్ మూడు నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేసింది. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎలక్షన్ కొనసాగుతుంది.
ఈ సమయాన్ని ప్రతి ఒక్క ఓటరు ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన తెలిపారు. ప్రతి ఓటర్ అభ్యర్థి తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకున్ని ఎన్నుకోవాల్సిందిగా ఆయన తెలిపారు.
