- కోనరావుపేట/ రిపోర్టర్ డి కరుణాకర్ /
పేద ప్రజల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు కార్యక్రమం అని వెంకట్రావుపేట సర్పంచ్ మంతెన సంతోష్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావు పేట గ్రామంలో సర్పంచ్ మంతెన సంతోష్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ ముందు చూపుతో రాష్ట్రంలో ప్రజలందరికీ కంటి వెలుగు కార్యక్రమాన్ని మొదటి విడత ప్రారంభించి, అనేకమందికి కంటి అద్దాలను అందించాలని తిరిగి రెండో విడత కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారన్నారు.
ప్రజలు ఎవరు కూడా కంటి సమస్యలతో బాధపడవద్దనే ముఖ్య లక్ష్యంతో కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్ సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వెంకట్రావు పేట గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, వార్డు సభ్యులు కుమ్మరి దయాకర్, మంతెన రమేష్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు జుర్రిగా మల్లేశం, నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
