
ఈరోజు జగదేవపూర్ గాంధీ మాజీ సర్పంచ్ శ్రీ నరసింహారామయ్య పంతులు 18 వ వర్ధంతి సందర్భంగా ఏఎన్నార్ పీపుల్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగదేవపూర్ లో వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీపీ బాలేశం గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పంతులు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ జగదేవపూర్ గాంధీగా పేరుగాంచి జగదేవపూర్ గ్రామానికి మూడు దశాబ్దాలకు పైగా సర్పంచిగా సేవలందించి గజ్వేల్ నియోజకవర్గం లోనే ఆదర్శ ప్రజా ప్రతినిధిగా గాంధీయవాదిగా నిరాడంబర రాజకీయవేత్తగా జీవితాన్ని గడిపిన నిజమైన ప్రజానాయకుడు నరసింహరామయ్య పంతులు గారని, జగదేవపూర్ లో 50 సంవత్సరాల క్రిందని జూనియర్ కళాశాల, పోలీస్ స్టేషన్, బ్యాంకు వారాంతపు అంగడి లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేసి భవిష్యత్తు దర్శనికతో విశాలమైన రోడ్లతో గ్రామాన్ని అందంగా తీర్చిదిద్ది జగదేవపూర్ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన నరసింహారామయ్య పంతులు జీవితం భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని మాదాసు శ్రీనివాస్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి, జగదేవపూర్ మాజీ సర్పంచులు బుద్ధ వెంకటయ్య, బుద్ధ మహేందర్, దౌలాపూర్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఇటిక్యాల సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్, కో ఆప్షన్ సభ్యులు ఎక్బాల్ మాజీ ఎంపీటీసీ కందుల బాలరాజు నాయకులు ఎస్ వెంకట్ రెడ్డి గుబ్బ శ్రీనివాసరావు కొత్త నరసింహారెడ్డి, గ్రామ ప్రముఖులు పేర్ల సత్తయ్య, అదరాసుపల్లి చిదంబర రావు, బుద్ధ బాల నారాయణ, అందె వెంకట్రాంరెడ్డి, ఆదరాసుపల్లి శ్రీధర్, జూలకంటి కృష్ణమూర్తి, గోపాల్ రెడ్డి, రాయికంటి శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘ నేతలు ఆదరాపల్లి శశిధర్ శర్మ, నేతి శంకర్ తదితరులు పాల్గొన్నారు




