వినాయకుల నిమజ్జనానికి డీజేలకు పర్మిషన్ లేదని రాయపోల్ ఎస్సై రఘుపతి అన్నారు. మండల పరిధిలోని ఉన్న డీజే షాపు యజమానులతో రాయపోల్ పోలీస్ స్టేషన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశానుసారం డిజిలకు ఎలాంటి పర్మిషన్ లేదని, గణేష్ మండపాల వద్ద డీజేలు పెట్టవద్దని సూచించారు. మరియు వినాయక నిమజ్జనం కార్యక్రమంలో డిజేలు పెట్టవద్దని తెలిపారు. చాలామంది వృద్ధులు వయస్సు పైబడిన వారు డీజే శబ్దాలతో గుండెనొప్పి వచ్చే అవకాశం ఉన్నందున మరియు శబ్ద కాలుష్యం పెరిగే అవకాశం ఉన్నందున డీజేలు ఉపయోగించవద్దన్నారు. దాని స్థానంలో సాధారణ శబ్దం వచ్చే రెండు బాక్సులను ఉపయోగించాలని సూచించారు. పోలీసుల సలహాలు సూచనలు పాటించి షాపు యజమానులు సహకరించాలని తెలిపారు. ఎవరైనా డీజేలు పెడితే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు.




