నేతకాని సంఘం నాయకులు మరియు, మాల సంఘం నాయకులు, పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకి, మద్దతు తెలిపారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో, నేతకాని సంఘం నాయకులు మరియు, మాల సంఘం నాయకులు, పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కి, మద్దతు తెలుపుతూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ , మరియు పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, మాల సంఘం నాయకులు, నేతకాని సంఘం నాయకులు పాల్గొన్నారు.
మాల సంఘం నాయకులు, నేతకాని సంఘం నాయకులు మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా BRS ప్రభుత్వం నేతకాని కార్మికులను అసలు పట్టించుకోలేదని, నేతకాని కార్మికులను అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు, BJP మతతత్వ రాజకీయాలు చేస్తుందని, రాజకీయాల కోసం ప్రజల్లో మత చిచ్చు పెట్టడం, BJP కి అలవాటు అని చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఒకటే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందని ఈ సందర్భంగా చెప్పవచ్చారు, పెద్దపల్లి నియోజకవర్గం కాక కి ఉన్న అనుబంధ అని చెప్పారు,పెద్దపల్లి నియోజకవర్గానికి కాక ఎన్నో సేవలు చేశారని, కాక కి పెద్దపల్లి నియోజకవర్గ వర్గ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని చెప్పారు, గడ్డం వంశీకృష్ణ గారికి,మాల సంఘం నాయకులు, నేతకాని సంఘం నాయకులు, పూర్తి మద్దతు తెలుపుతున్నామని రానున్న ఎన్నికల్లో , పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు,
ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా, నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలంతా ఒకటే మాట చెబుతున్నారు అని చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, నాయకులతో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నామని, సమస్య చెప్పగలుగుతున్నామని, కావలసినవి ధైర్యంగా అడుగుతున్నాము అని చెప్పారు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వస్తుంది చెప్పారు, చెప్పినట్టే మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అందించిందని, 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తుందని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించిందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం, ఇందిరమ్మ ఇల్లు అమలు చేస్తున్నారని చెప్పారు, ఒక్కొక్క నియోజకవర్గానికి మొదటి దశలో 3500 ఇస్తామని, CM రేవంత్ రెడ్డి చెప్పారు అని చెప్పారు, BRS నాయకులల పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇచ్చేలా కాకుండా, పేదవాళ్లకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అందేలా చూస్తామని చెప్పారు, ఎన్నికలలో మాటిచ్చినట్టు రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ లో ఇప్పటికి, సింగరేణి మరియు ఆర్టీసీలో 30 నుంచి 40 వేల ఉద్యోగాలు ఇచ్చాము అన్నారు, ఎన్నికల అనంతరం మిగతా ఉద్యోగం కూడా భర్తీ చేసే దిశగా కార్యక్రమలు ఉంటాయి అని చెప్పారు, కేంద్రం నుండి రాహుల్ గాంధీ కూడా 30 లక్షల ఉద్యోగులు ఇస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పారు, ముఖ్యంగా మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు, 1992 లో దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు, ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి ఆర్థిక సంక్షేపం మంచి దేశం కాపాడింది అని చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వమే 70 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసిందని చెప్పారు, ఇప్పుడు కూడా ఆగస్టు 15 లోపల రెండు లక్షల రుణమాఫీ తప్పకుండా చేసి తీరుద్దామని చెప్పారు, BRS నాయకులు అంతా రాష్ట్ర ఖజానానికి దోచుకున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి ఫైనాన్స్ మేనేజ్మెంట్ బాగా తెలుసు అని, ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు, బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యాసర వస్తువుల ధరలు చాలా అధికంగా పెరిగాయని, కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే అయిన తర్వాత, సొంత నియోజకవర్గమైన రామగుండం కూడా ఎరోజు వెళ్లి చూసింది లేదు అని, సింగరేణి కార్మికులు ఎరోజు పట్టించుకోలేదని చెప్పారు, తెలంగాణ వచ్చాక సింగరేణి సంస్థలు 62 ఉద్యోగాలు ఉండేవి అని, ఇప్పుడు కేవలం 39వేల ఉద్యోగులు మాత్రమే ఉన్నాయని, సుమారు 23000 ఉద్యోగాలు కోల్పోయామని చెప్పారు, సింగరేణి క కార్మికుల కొడుకు అని చెప్పుకునే కొప్పుల ఈశ్వర్ గారు, కార్మికుల హక్కులను కాపాడలేదుని, కార్మికుల ఉద్యోగాలు కూడా కనీసం కాపాడలేకపోయారని చెప్పారు, ప్రజలకు ఎటువంటి సేవ చేయకుండా ఇప్పుడు మళ్లీ ఎన్నికల్లో ఎలా పోటీ చేయడానికి వస్తున్నారని అడిగారు, పెద్దపల్లి నియోజకవర్గానికి కాక ఎన్నో సేవలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు, రానున్న ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణ ని భారీ మెజార్టీతో గెలిపిస్తే, కాక లనే వంశీకృష్ణ కూడా ప్రజలకు సేవ చేస్తాడని, నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడతాడు అని చెప్పారు, ప్రజల ఆశీర్వాదాలతో పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం శ్రీకృష్ణ ని, భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పారు…
ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, మాల సంఘం నాయకులు, నేతకాని సంఘం నాయకులు, తనకు మద్దతుగా నిలబడినందుకు ధన్యవాదాలు తెలిపారు, గత పది సంవత్సరాలుగా BRS నాయకులు, దోపిడీ రాజకీయాలు , దౌర్జన్యాలు, సింగరేణి కార్మికుల శ్రమను కూడా దోచుకున్నారని చెప్పారు, నెలకు 20 నుండి 30 వేలు వచ్చే చిన్న ఉద్యోగాలకు, ఐదు లక్షల పైన లంచాలు తీసుకున ఘనత BRS నాయకులకు దక్కుతుందని చెప్పారు, తెలంగాణ పోరాటంలో కార్మికుల పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పారు, తెలంగాణ వచ్చిన తర్వాత కార్మికులు ఏ మాత్రం పట్టించుకోకుండా, వాళ్లని గాలి వదిలేసిన పార్టీ BRS పార్టీ అని అన్నారు, పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు ప్రమాదంలో జర కూడా నది ఏమైనా జరిగితే కోటి రూపాయలకు పైన ఇన్సూరెన్స్ ఇస్తుందని చెప్పారు, BJP పార్టీ దళితుల ద్రోహి అని చెప్పారు, బ్రిటిష్ వారిలా విభజించు పాలించిన పద్ధతిని పాటిస్తున్నారని, దేశం ఐక్యత పెంచాల్సింది పోయి, కులాలు మతాల వారీగా విడగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని చెప్పారు, అహంకారానికి అభివృద్ధికి మధ్య పోటీ జరుగుతుందని, BJP ప్రభుత్వం మేం గొప్ప నేహంకారాల ఉందని, కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు చేసిన అభివృద్ధి ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పారా గడ్డం వంశీకృష్ణ, తన సపోర్ట్ చేస్తూ వచ్చిన వారందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంగా చెప్పారు, పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంటు అభ్యర్థిగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.





