వీర్నపల్లి పోలీస్ స్టేషన్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులను,5S అమలు తీరు,ఫంక్షనల్ వర్టికల్స్ ను కోర్ట్ డ్యూటీ,రిసెప్షన్,బ్లూ కోల్ట్ పెట్రోల్ మొబైల్, టెక్ టీమ్స్ పనితీరు ఎస్పీ పరిశీలించారు. పోలీస్ సిబ్బంది పని తీరు,ప్రజలకు అందుతున్న సేవలు, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న నేరాల వివరాలను ఎస్పీ పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుల లక్ష్యం అని అన్నారు. పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సమర్ధవంతమైన సేవలను అందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఎస్పీ వెంట ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి, వీర్నపల్లి ఎస్సై నవత, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
