ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూలై 21, మండలంలో గత మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ఇండ్లు నేలమట్టమయ్యాయి తెర్లుమద్ది, వెంకట్రావుపల్లె,రామలక్ష్మణపల్లె నాలుగు ఇల్లు కూలగా ఎస్సైవెంకటేశ్వర్లు తన సిబ్బందితో సందర్శించి మండలంలో నిరంతరం కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచనలిస్తూ సురక్షిత ప్రాంతంకు తరలించే పనిలో పడ్డారు.లోతట్టు పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు పాతఇండ్లు, పూరిగుడిసెలు శిథిలావస్తలో ఉండే నివాసాలలో అప్రమత్తంగా ఉండే విధంగా ఉండాలని గ్రామ సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డితో పాటు పలు ప్రజాప్రతినిధులకు అధికారులు సూచనలు ఇచ్చారు.

