కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎస్బి లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గుంటి రాజమౌళిని సోమవారం అతి ఉత్కృష్ట సేవా పతకం వరించింది . గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎంపికచేయగా , కమిషనర్ సుబ్బారాయుడు చేతుల మీదుగా పతకాన్ని అందుకున్నారు . 1989 వ సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిన రాజమౌళి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సేవా పథకం , తెలంగాణ గవర్నమెంట్లలో ఉత్తమ సేవా పతకాలు , గుడ్ సర్వీస్ ఎంటర్ లో 50 రివార్డులు , క్యాష్ రివార్డులు 135 అందుకున్నారు . గతంలో ఇల్లంతకుంట , ఎల్ ఎం డీ , కరీంనగర్ టూ టౌన్ , చొప్పదండి పోలీస్ స్టేషన్లలో రాజమౌళి విధులు నిర్వహించారు.
