ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన పాశం దేవ రెడ్డి

198 Views

చురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ,ఎల్లారెడ్డిపేట పిభ్రవరి 13 :

ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాశం దేవ రెడ్డి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు ,
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రైతు చర్చా మండలిలో నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని రెడ్డి సంక్షేమ సంఘం ఎన్నికల కమీటీ ఏర్పాటు చేసింది, ఎన్నికల కమిటీ సభ్యులుగా జంగా అంజిరెడ్డి , నేవూరి వెంకట నరసింహా రెడ్డి , రావుల ఎల్లారెడ్డి ,
నల్ల మహేందర్ రెడ్డి ,మర్రి వెంకట్ రెడ్డి ,ఇప్ప రవీందర్ రెడ్డి , చందుపట్ల లక్ష్మారెడ్డి , నేవూరి దేవేందర్ రెడ్డి , మొడుసు లక్ష్మారెడ్డి లు వ్యవహరిస్తారు ఈనెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు నామినేషన్లకు తుది గడువు విధించారు,
ఈ నెల 22 నుండి 25 వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ గా నిర్ణయించారు,
అద్యక్ష పదవికి పోటీ చేయువారు 5000 రూపాయల నామినేషన్ రుసుము చెల్లించవలసి ఉంటుంది,
రెండేళ్ల కోసారి ఈ అద్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తారు ,
ఆదివారం తన మద్దత్తుధారులతో భారీగా కదిలి వచ్చి మంచి ముహూర్తాన్నీ చూసుకొని అద్యక్ష పదవికి పాశం దేవరెడ్డి 5000 రూపాయల నామినేషన్ రుసుము చెల్లించి ఓక సెట్టు నామినేషన్ ను దాఖలు చేశారు,
ఆయన వెంట ఎల్లారెడ్డిపేట మండల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కొండాపురం బాల్రెడ్డి ,అక్కపెల్లి ఉపసర్పంచ్ గోగూరి ప్రథీఫ్ రెడ్డి , రెడ్డి సంఘం ప్రతినిధులు పోరెడ్డి శ్రీనివాసరెడ్డి , నిమ్మ నారాయణ రెడ్డి , నిమ్మ మల్లారెడ్డి , మోతే నరసింహారెడ్డి , జంకె లచ్చిరెడ్డి , జంకె జనార్ధన్ రెడ్డి , కొప్పుల రవీందర్ రెడ్డి , మర్రి శ్రీనివాస్ రెడ్డి , ముత్యాల బాల్ రెడ్డి జంగా బుచ్చిరెడ్డి సంజీవరెడ్డి రవీందర్ రెడ్డి పలు గ్రామాలకు చెందిన రెడ్డి సంక్షేమ సంఘానికి చెందిన మద్దత్తుధారులు నామినేషన్ సందర్భంగా తరలివచ్చారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7