తెలంగాణాలో ఉన్న అన్ని తండా గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం కొరకు నిధులు మంజురు చేయడం హర్షనీయమని వీర్నపల్లి మండల జెడ్పిటిసి సభ్యులు
గుగులోత్ కళావతి సురెష్ నాయక్ , రాష్ట్ర బంజారా సంఘం నాయకులు గూగులోత్ సురేష్ నాయక్ లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు శనివారం కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదెశ చరిత్రలో ఎవరు చేయనివిదంగా ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనుల అబివృద్ది పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు.తండాలను నూతన గ్రామపంచాయతీలుగా చేశారన్నారు. పోడుభూములకు పట్టాలు ఇవ్వాలన్న ,గిరిజన రేజర్వేషన్లు పెంచాలన్న , గిరిజన బందు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వానికే సాధ్యమన్నారు. గత పాలక ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని తండాలకు పక్క భవనాలు ఉండాలనే సదుద్దేశంతో 1216 గ్రామపంచాయతిలకు నూతన భవనాల నిర్మాణం కొరకు 243.20 కోట్లు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందన్నారు. గిరిజనుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
