ప్రాంతీయం

*నిరుపేదలకు అండగా ఉంటా: తెలంగాణ రెడ్డి హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాతూరి వెంకట్ రెడ్డి

121 Views

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని బోనాల గ్రామానికి చెందిన తలారి నారాయణ అనారోగ్యంతో మృతి చెందగా తెలంగాణ రెడ్డి హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాతురి వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. చేగుంట మండల కేంద్రనికి చెందిన మురాడి యాదగిరి కుటుంబానికి 50 కిలోల సన్న బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ…. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడే నిరుపేదలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. వారితో పాటు పాల్గొన్న పులిమామిడి కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ సీనియర్ జర్నలిస్ట్ నాయిని రాజగోపాల్ మాట్లాడుతూ… తెలంగాణ రెడ్డి హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాతూరి వెంకట్ రెడ్డి గారు చేస్తున్న సేవలు హర్షించదగ్గ విషయమని కుల మతాలకతీతంగా ప్రతి పేదవారికి తోచిన కాడికి సహాయం అందించడం ఆయన మానవత్వానికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆది వెంకన్న ఆరెకటిక హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కటిక అశోక్, చిన్నస్వామి ప్రశాంత్ ప్రసాద్ చేగుంట మండల బిజెపి యువ నాయకులు స్వామి రవి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7