
-16 రోజులు.. 62 వేల 489 మందికి కంటి పరీక్షలు
– *కంటి వెలుగు కు విశేష స్పందన*
– వీర్నపల్లి మండల కేంద్రంలోని కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన మంత్రి కేటిఆర్
దృష్టి లోపాలను దూరం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ‘కంటి వెలుగు’. మానవత్వం ఇమిడి ఉన్న ఎంతో గొప్ప కార్యక్రమం
దృష్టి లోపాలతో బాధ పడుతున్న పేద ప్రజలకు ‘కంటి వెలుగు’ చూపును ప్రసాదిస్తున్నది. పల్లె నుంచి పట్టణం వరకు లక్షల మంది బతుకుల్లో కాంతులు నింపుతున్నది.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటివెలుగు-2’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ నెల 18న సీఎం కేసీఆర్ కంటి వెలుగును ప్రారంభించగా, 19వ తేదీ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తున్నారు.
ఇందుకు గానూ మొత్తం 26 వైద్య టీమ్ ల ద్వారా క్షేత్ర స్థాయిలో కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తుంది.
ఒక్కో కంటి వెలుగు శిబిరంలో 1 -వైద్యాధికారి, 1- ఆప్తో మెట్రిస్ట్, 1- డాటా ఎంట్రీ ఆపరేటరు, 2- ఆరోగ్య కార్యకర్తలు(ANM), 1- హెల్త్ సూపర్వైజర్,
3- ఆశా కార్యకర్తలు ఉన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో 21 కంటి వెలుగు టీమ్ లు, సిరిసిల్ల పట్టణంలో 3, వేములవాడ పట్టణంలో 2 టీమ్ లు పని చేస్తున్నాయి.
పరీక్షల నిర్వహణ అనంతరం దృష్టి లోపాలు అవసరమైనవారికి కళ్లద్దాలు, మందులు అందజేస్తున్నారు.
ప్రభుత్వ సూచనతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. జిల్లా అధికారులు క్యాంపుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు ఎప్పటి వరకూ నమోదు కాలేదు. వైద్య శిబిరాల్లో నాణ్యమైన వైద్య సేవలందించడంతో కంటి వెలుగు కార్యక్రమానికి భారీ స్పందన వస్తున్నది.
*16 రోజులు.. 62,489 మందికి కంటి పరీక్షలు*
కంటి వెలుగు-2 ప్రారంభమైన ఆరో రోజు వరకు జిల్లా వ్యాప్తంగా 62,489 మందికి కంటి పరీక్షలు చేశారు.
12,521 మందికి ఉచితంగా అద్దాలు ఇచ్చారు. 8,800 మందికి పాయింట్ కళ్లద్దాలకు ఆర్డర్ ఇచ్చారు.
*వంద రోజుల్లో 4 లక్షల 22 వేల 182 మందికి మందికి..*
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 255 గ్రామాలు, వేములవాడ ,సిరిసిల్ల పట్టణాలలోని 67 వార్డులలో మొత్తం 322 హాబిటేషన్ లలో కంటి వెలుగు కార్యక్రమం కింద ముందస్తు షెడ్యూలు ప్రకారం పేజీల వారిగా శిబిరాలు ఏర్పాటు చేసి 18 సంవత్సరాలు పైబడిన 4 లక్షల 22 వేల 182 మందికి కంటి పరీక్షలు చేయడానికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందుకు జిల్లా వ్యాప్తంగా 26 వైద్య బృందాలు పని చేస్తున్నాయి. ఈ కార్యక్రమం వారంలో ఐదు రోజులు(శని, ఆదివారాలు మినహా) నిర్వహిస్తున్నారు.
*శిబిరాలకు విశేష స్పందన*
శిబిరానికి వచ్చిన ప్రతి వ్యక్తి వివరాలను డీఈవో, ఏఎన్‌ఎంలు ట్యాబ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు డేటా నమోదు చేస్తున్నారు. దూరదృష్టి, దగ్గరి దృష్టికి సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. కంట్లో శుక్లాలు ఉన్నాయా? ఇన్‌ఫెక్షన్లు ఉన్నాయా? అనే విషయాలను పరిశీలిస్తున్నారు. ఒకవేళ శుక్లాలు ఉంటే ఆప్టోమెట్రిస్ట్ ఆధ్వర్యంలో కంప్యూటరైజ్డ్ పరీక్షలు చేస్తున్నారు. సాధారణ దృష్టి లోపాలను గుర్తిస్తే అకడికకడే రీడింగ్ గ్లాసెస్ ఇస్తున్నారు. ముందస్తుగానే 20 లక్షల కంటి అద్దాలు సిద్ధం చేసి పెట్టడంతో ఎక్కడా అద్దాల కొరత రావడం లేదు. జనవరి 19 నుంచి జూన్ 15 వరకు జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలలోని అన్ని వార్డులలో శిబిరాలు నిర్వహణకు ప్రణాళికలు రూపొందించారు. వైద్య శిబిరాల నిర్వహణపై ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది.
*కంటి చూపు ఎట్లుంది పెద్దవ్వా….*
*కే టి ఆర్ ఆత్మీయ పలకరింపు*
జనవరి 30 వ తేదీన వీర్నపల్లి మండల కేంద్రంలోని క్లస్టర్ రైతువేదిక లో ఏర్పాటు చేసిన
కంటి వెలుగు శిబిరాన్ని మంత్రి కేటిఆర్ సందర్శించారు.
కంటి చూపు ఎట్లుంది పెద్దవ్వా….
పరీక్షలు చేసుకున్నారా? అంటూ మంత్రి కే తారక రామారావు కంటి పరీక్షల కోసం శిబిరాలకు వచ్చిన వృద్ధులతో ఆత్మీయంగా పలకరించారు.
దూరం,దగ్గరి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి వెలుగు శిబిరాల్లో ఉచితముగా ఇస్తున్న కళ్లద్దాలు మన తెలంగాణ లోనే తయారయ్యాయనీ వారికి చెప్పారు.
శిబిరంలో నీ 5 కౌంటర్ లను , వాటి పనితీరు పరిశీలించారు.
కంటి వెలుగు కార్యక్రమం ఎలా ఉందని లబ్దిదారులను, స్పందన ఎట్లుంది అంటూ వైద్య సిబ్బందిని శ్రీ కేటిఆర్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని వారు కేటీఆర్‌కు వివరించారు. కంటి వెలుగు శిబిరం వివరాలు, ఇప్పటి వరకు ఎంత మందికి పరీక్షలు నిర్వహించారు, కండ్లద్దాలు పంపిణీ చేశారనే విషయాలను సిబ్బందిని అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు.
కేసీఆర్ దయతో సూపొచ్చింది..
వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. నాకు
కండ్లు సరిగా కనిపించవు. ఇది ఇప్పటి బాధ కాదు. చాలా రోజుల సంది ఇదే ఇబ్బంది. ప్రయివేటు దవాఖానకు పోదామంటే పైసలు లేవాయే. చివరికి ఇంట్లో పని చేసుకోవడానికి కూడా కష్టమే అయ్యేది. మా దగ్గర కేసీఆర్ అందరికీ ఉచితంగానే కండ్ల అద్దాలు ఇస్తున్నరని తెలిసింది. శిబిరానికి పోయి కండ్లు చూయించుకున్న. డాక్టర్లు చూసి అద్దాలిచ్చిన్రు. ఇప్పుడు సూపు మంచిగైంది. సీఎం కేసీఆర్ సార్ దయతో నాలాంటోళ్లు ఎందరికో సూపొచ్చింది.
– నీలం సత్తవ్వ , వీర్నపల్లి
కండ్లు మసక మసకగా కనిపిస్తుండే.
పొలం పని చేసే టప్పుడు కష్టమైతుండే.
ఆసుపత్రిలో చూపిద్దామంటే పైసలు లేకపాయే. నా బతుకు గింతే అనుకున్న. కేసిఆర్ సార్ పెట్టిన కంటి వెలుగుతో నా కండ్ల సూపు సక్కగైంది. నాతో పాటు
ఎంతో మంది పేదల జీవితాలకు ‘కంటి వెలుగు’ సూపును ప్రసాదించింది.
– డి చంద్రకళ , వీర్నపల్లి
*స్పందన చాలా బాగుంది*
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాలకు ప్రజల నుంచి స్పందన వస్తున్నది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో శిబిరం ప్రారంభానికి ముందే ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అవసరమైన చోట ప్రత్యేకంగా టెంట్లు వేయిస్తున్నాం. శుద్ధ జలం అందిస్తున్నాం.
కంటి చూపు బాగైన ప్రజల సంతోషం చూస్తే
ఆనందంగా ఉంది.





