122 Views
ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/15; రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట స్థానిక జెడ్.పి.హెచ్.

ఎస్ పాఠశాలలో భారతరత్న, మిస్సయిల్స్ మ్యాన్, ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా దేశ అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల పాత్ర నీకు నచ్చిన ఆవిష్కరణ అంశంపై 8,9,10 విద్యార్థులకు చేయూత మిత్ర ఫౌండేషన్ ఎల్లారెడ్డిపేట వారి ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ నిర్వహించారు ఈపోటీలో 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు దూస శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి పాఠశాల శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలకు ప్రయోగశాల కావాలని, ప్రతి విద్యార్థి శాస్త్ర సాంకేతిక శాస్త్రాలపై ఆసక్తిని పెంచుకోవాలని ,తమ పరిసరాలలో ఉన్న ఆవిష్కరణ నిశితంగా గమనిస్తూ వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలను కనుగొని అబ్దుల్ కలాం కలలుగన్న దేశాన్ని తయారు చేయాలని .. మూఢనమ్మకాలను విడిచిపెట్టి తార్కిక చింతను అలవర్చుకొని ప్రతి ఒక్క విద్యార్థి సైంటిస్ట్ గా ఎదగాలని అన్నారు. మాఫౌండేషన్ ప్రతిభ గల విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. అనంతరం వ్యాస రచన పోటీలో మొదటి బహుమతి గాజుల వైష్ణవి(1000 రు),రెండవ బహుమతి నేవూరి వైష్ణవి హారిక (500రు) బత్తుల హారిక (500 రు)తృతీయ బహుమతి పొందిన విద్యార్థులకు నగదు, మేమొంటో ప్రధానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.హన్మండ్లు, వడ్ల ఆంజనేయులు, మాదాసు. నాగరాజు, సాదు సాయిరెడ్డి, గౌరీ రాజు, బాధ గోపి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు గర్గుల కృష్ణహరి, దరిపెల్లి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found